← Back to PublicVibe Media

State News

ఖానాపూర్ లో భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు..

ఖానాపూర్ లో భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు..

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలో దసరా దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల మొదటి రోజున (ఆదివారం) శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలకారంలో దర్శనమిచ్చిన జగన్మాతను భక్తులు, మాతా దీక్షాధారులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Story image

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరిపై ఆ అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని పూజించారు.

ఈ పూజా కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తల్లారి మల్లేశ్, దేవాదాయ శాఖ కమిటీ సభ్యులు వెంకటేష్, బిక్షపతి, శివరాజ్, సందీప్, కుమార్ గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.