← Back to PublicVibe Media

State News

అసంపూర్తి రోడ్డు పనులు.. అవస్థలు పడుతున్న స్థానికులు

అసంపూర్తి రోడ్డు పనులు.. అవస్థలు పడుతున్న స్థానికులు

రంగారెడ్డి జిల్లా గండిపేట, అక్టోబర్ 06 (పబ్లిక్ వైబ్ ప్రతినిధి):

గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. గ్రామంలో ముసి కాలువకు ఆనుకుని ఉన్న సీసీ రోడ్డుపై గతంలో హెవీ వాహనాలు తిరగడంతో అది కొన్ని చోట్ల క్రాక్ ఇచ్చి పాడైపోయింది. ఈ రోడ్డును బాగుచేస్తామని చెప్పి అధికారులు కొద్ది రోజుల క్రితం తవ్వి వదిలేశారు.

Story image

రోజులు గడుస్తున్నా ఆ తవ్విన రోడ్డుకు కొత్త రోడ్డు వేయకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. రోడ్డుంతా గుంతలు పడి అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై నడవాలన్నా, బైక్‌లపై వెళ్లాలన్నా గుంతలు ఏవో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే తవ్విన రోడ్డును బాగుచేసి కొత్త రోడ్డు వేయాలని గ్రామ కాలనీ వాసులు కోరుతున్నారు.