← Back to PublicVibe Media

India

దేశంలో 60కి చేరిన చీతాల సంఖ్య

దేశంలో 60కి చేరిన చీతాల సంఖ్య

అక్టోబర్ 05, పబ్లిక్ వైబ్: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్‌‌ చీతా’లో మరో అపూర్వ మైలురాయి నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో వంశాభివృద్ధి వేగంగా సాగుతుందనడానికి నిదర్శనంగా మరో అద్భుతం జరిగింది. దేశంలోనే జన్మించిన 32 నెలల వయసున్న ‘కేజీపీ21’ అనే ఆడ చీతా.. తాజాగా ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా దేశ ప్రజలతో పంచుకున్నారు.

Story image

దేశంలో 60కి చేరిన చీతాల సంఖ్య

తాజాగా జన్మించిన ఈ ఐదు కూనలతో కలిపి భారతదేశంలో మొత్తం చీతాల సంఖ్య 60కి చేరిందని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ వెల్లడించారు.