State News
ఘనంగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలు

రంగారెడ్డి జిల్లా, గండిపేట అక్టోబర్ 04 (పబ్లిక్ వైబ్) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, ప్రజానాయకుడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలను గండిపేటలోని ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. నార్సింగి సర్కిల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు పెద్దపులి కృష్ణ కిషన్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం ఇంద్రారెడ్డి చేసిన సేవలు, ప్రజలతో ఆయనకున్న అనుబంధం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో నార్సింగి సర్కిల్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ ముక్తార్, మాజీ సర్పంచ్ ముత్యాలు, ప్రభాకర్, మల్లేష్, ఎక్స్ అఫీషియో సభ్యురాలు ప్రశాంతి యాదవ్, నరసింహ, నాగరాజు, శ్రీనివాస్, గణేష్ ముదిరాజ్, గణేష్ రెడ్డి, మహిపాల్, రాజు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, సంతోష్, అరుణ, జైసింహ, జయమ్మ, రజినీకాంత్, గంగుల మహేందర్, పరవేద నరసింహ, ఆసిఫ్, రాఘవేందర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.